తెలంగాణ

telangana

Smart Phone Addiction Boy

ETV Bharat / videos

'ఫ్రీ ఫైర్'​కు బానిస.. అనుక్షణం అదే కలవరింపు!.. మతిస్థిమితం కోల్పోయిన బాలుడు

By

Published : Jul 12, 2023, 5:36 PM IST

Smart Phone Addiction Boy : ప్రస్తుత రోజుల్లో స్మార్ట్​ఫోన్లను చాలా మంది పిల్లలు తెగ వాడేస్తున్నారు. ఫోన్​ ఇవ్వకపోతే మారాం చేసి మరీ తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ప్లే స్టోర్ల నుంచి వివిధ రకాల గేమ్స్​ను ఇన్​స్టాల్​ చేసి ఆడుతూ చాలా సమయం గడుపుతున్నారు. అలా స్మార్ట్​ఫోన్లకు బానిసైన పిల్లల్లో కొందరు.. అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. తాజాగా స్మార్ట్‌ఫోన్‌కు విపరీతంగా బానిసైన ఓ బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు.

రాజస్థాన్​లో అల్వార్​కు చెందిన ఆ బాలుడికి ప్రత్యేక పాఠశాలలోని నిపుణుల ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఆ బాలుడు ఎక్కువ సమయం ఫ్రీఫైర్‌ ఆటలోనే గడిపేవాడని తల్లిదండ్రులు తెలిపారు. 
"మా దగ్గరకు ఆ బాలుడిని అతడి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. మా అంచనా ప్రకారం.. ఫ్రీఫైర్​ గేమ్​లో ఆ బాలుడు ఒక్కసారి ఓడిపోయాడు. దాన్ని తట్టుకోలేక అతడు మతిస్థిమితం కోల్పోయాడు. మేము ఆ బాలుడి కోసం భౌతిక ఆటల షెడ్యూల్​ను తయారు చేశాం. దాని ప్రకారం ఆడిస్తున్నాం. అలా అతడికి నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం" అని నిపుణులు భవానీ శర్మ చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details