నీలాకాశంలో ఫైటర్ జెట్స్ వాయుసేన అద్భుత విన్యాసాలు - భారత వైమానిక దశ విన్యాసాలు
మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో భారత వైమానిక దళం విన్యాసాలు చేపట్టింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ మెయింటెనెన్స్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ ఎయిర్‌షోను నిర్వహించారు. సూర్యకిరణ్ ఏరోబేటిక్ బృందం, సరోంగ్ హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఎయిర్ డిస్‌ప్లే బృందాలు, గెలాక్సీ బృందాలు, ఎయిర్ వారియర్ డ్రిల్ బృందాలు చేసిన ప్రదర్శనలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్నాయి. ఇవే కాకుండా పారా హ్యాంగ్ గ్లైడింగ్, రవాణా, యుద్ధ విమానాలు ఫ్లై పాస్ట్ విన్యాసాలు చేపట్టాయి.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST