తెలంగాణ

telangana

20 అడుగుల సైకత శివలింగం

ETV Bharat / videos

Mahashivratri Special : అక్కడి శివలింగం చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా..? - Mahashivratri Arrangements in sangareddy

By

Published : Feb 16, 2023, 1:44 PM IST

Mahashivratri Arrangements in Telangana: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాలన్నీ వేడుకలకు ముస్తాబవుతున్నాయి. ఆలయ పరిసరాల్లో పనులు చకచకా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి మరీ ఆలయాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. శివభక్తులు అత్యధికంగా తరలివచ్చే వేములవాడ రాజన్న ఆలయంలో ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్న మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో సైతం స్థానిక ప్రజాప్రతినిధులు మహా శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నారు. ప్రజలు శివరాత్రి పూజలు, జాగారం చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తున్నారు. వరంగల్​ నగరంలోని అజంజాహి మైదానంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో నూతన సచివాలయం నమూనాతో కూడిన భారీ సెట్టును ఏర్పాటు చేస్తున్నారు. శివరాత్రి జాగరణ కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సైతం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. శివరాత్రి దగ్గర పడటంతో మార్కెట్లన్నీ పండ్లతో కిటకిటలాడుతున్నాయి. అరటి, దానిమ్మ, కర్జూర, సపోట, కర్బూజ, మొరం గడ్డ, బత్తాయి, ద్రాక్ష మొదలైన పండ్లు మార్కెట్‌లలో కొలువుదీరాయి.

Maheshwara Siddhanthi Interview: మహా శివరాత్రి వేడుకలను ప్రతి ఏటా వినూత్నంగా నిర్వహించే సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈ సంవత్సరం సైకత శివలింగాన్ని ఏర్పాటు చేశారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో సముద్రాలు, వివిధ నదుల నుంచి ఇసుక సేకరించారు. 360 టన్నుల ఇసుకతో 19.5 అడుగుల ఎత్తైన శివలింగాన్ని తయారు చేశారు. 

ఈ సైకత శివలింగాన్ని భక్తుల సందర్శన కోసం మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ నెల 18న మహా శివరాత్రిని పురస్కరించుకుని 19వ తేదీ వరకు జ్యోతిర్వాస్తు పీఠంలో ఉత్సవాలు కొనసాగనున్నాయి. అప్పటి వరకు ఈ శివలింగం భక్తులకు దర్శనమివ్వనుంది. శివరాత్రి రోజున భక్తులు సైకత శివలింగానికి అభిషేకం చేసే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. పురాణాల ప్రకారం శివరాత్రి రోజున సైకత శివలింగ అర్చన అత్యంత ఫలప్రదమైనదని అంటున్న మహేశ్వర సిద్ధాంతితో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details