తెలంగాణ

telangana

Car Accident at Oldcity in Purana Haveli

ETV Bharat / videos

Oldcity Car Accident Today : మద్యం మత్తులో యువకుల వీరంగం.. చితకబాదిన స్థానికులు

By

Published : Aug 14, 2023, 12:31 PM IST

Oldcity Car Accident Today : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. వాహనదారులు పాటించడం లేదు. రోడ్డు నియమాలను అతిక్రమించినందుకు భారీ మొత్తంలో జరిమానాలు విధించినా.. ఆకతాయిల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు వేగంగా కారు నడిపిస్తూ వాహనాలను ఢీకొట్టి.. ఇతరులను గాయపరచిన సంఘటన పాతబస్తీలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని పాతబస్తీ పురాని హవేలి ప్రాంతంలో అతి వేగంతో ఓ కారు వాహనాలను ఢీ కొట్టింది. ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. అనంతరం కారులో ఉన్న వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికులు కారును వెంబడించి.. వాహనంలో ఉన్న యువకులను పట్టుకుని చితకబాదారు. కొందరు వాహనదారులు కోపంతో కారును ధ్వంసం చేశారు. అనంతరం నిందితులను పోలీసులకు అప్పగించారు. నిందితులపై పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details