తెలంగాణ

telangana

ETV Bharat / videos

వలలో 17 చేపలు- వేలంలో రూ.23లక్షలు! మహిళా జాలరి పార్వతికి జాక్​పాట్​ - ఒడిశాలో చేపల వేలం

🎬 Watch Now: Feature Video

Oily Fishes Auction In Odisha

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 7:19 PM IST

Oily Fishes Auction In Odisha :చేపల వేటకు వెళ్లిన ఓ మహిళా జాలరికి కాసుల పంట పండింది. బంగాల్ తీరప్రాంతానికి చెందిన ఆ మహిళ వలలో అరుదైన 17 ఆయిల్ చేపలు పడ్డాయి. వాటిని వేలం వేయగా రూ.23లక్షలకుపైగా పలికాయి. దీంతో ఆమె కొన్ని గంటల్లోనే లక్షాధికారిగా మారింది! ఒడిశా జగత్​సింగ్​ పుర్​ జిల్లాలో ఉన్న పారాదీప్ పోర్ట్​లో ఈ సంఘటన జరిగింది.

బంగాల్​ తీరప్రాంతానికి చెందిన పార్వతి కొందరి మత్స్యకారులతో సోమవారం చేపల వేటకు వెళ్లి సముద్రంలో వల విసిరింది. వలను వెనక్కి లాగేందుకు ప్రయత్నించగా చాలా బరువుగా అనిపించింది. తన వలలో భారీ చేపలు పడ్డాయని ఆనందపడింది. మిగతా మత్య్సకారుల సహాయంతో వలను పడవలోకి లాగింది. అప్పుడు చూడగా తన వలలో పడ్డ చేపలను అరుదైన ఆయిల్ ఫిష్​లుగా గుర్తించింది.

వెంటనే పారాదీప్ పోర్ట్​కు 17 ఆయిల్ చేపలను తెచ్చి వేలం వేసింది. స్థానికంగా ఉన్న వ్యాపారులు పోటీపడి మరీ ఆ చేపలను కొనుగోలు చేశారు. రూ.23 లక్షలకుపైగా వెచ్చించి చేపలను కొన్నారు. ఈ చేపలను మందుల తయారీలో ఉపయోగిస్తారని, అందుకే భారీ ధర పలికాయని మత్య్సకారులు చెప్పారు. విదేశాల్లో ఈ చేపలకు భారీ డిమాండ్ ఉందని, అందుకే కొనుగోలు చేసి వ్యాపారులు వాటిని ఎగుమతి చేస్తారని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details