NTR Family Members on Hunger Strike to Support Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబసభ్యుల నిరాహారదీక్ష - చంద్రబాబుకు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు
Published : Sep 13, 2023, 9:46 PM IST
NTR Family Members on Hunger Strike to Support Chandrababu: చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా కృష్ణా జిల్లా పామర్రులో నిర్వహించిన నిరాహారదీక్షలో నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీను పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్టును కేవలం రాష్ట్రంలోని ప్రజలే కాకుండా ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న తెలుగు ప్రజలు, చంద్రబాబు అభిమానులు ఖండిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నేడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు నిరసనలతో అట్టుడికాయి. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. 'బాబుతో నేను' కార్యక్రమం ద్వారా నిరాహార దీక్షలు చేశారు. సామాజిక మాధ్యమాలలో సైతం 'బాబుతో నేను' (IAmWithBabu) హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగిస్తూ తెగ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇది ట్విటర్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు బాబుకు మద్దతుగా నిరసనలు తెలిపారు.