NRI Protests in America Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా... ఎన్ఆర్ఐల నిరసన కార్యక్రమాలు - ఎన్ఆర్ఐలు అరెస్ట్
Published : Sep 10, 2023, 3:36 PM IST
NRI Protest programs in America against Chandrababu arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాకుండా... దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో... దేశం వెలుపల ఉన్న ప్రవాసాంధ్రులు సైతం చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా అమెరికాతో పాటుగా పలుదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ప్రవాసాంధ్రుల నిరసనలు: సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేయటాన్ని ఖండిస్తూ... ప్రవాసాంధ్రులు నిరసనలు(NRI Protest programs) చేపట్టారు. అమెరికాలోని బోస్టన్, డెట్రాయిల్, ఐర్లాండ్ దేశంలో చంద్రబాబు అభిమానులు, టీడీపీ సానుభూతిపరులు... ఆందోళన చేశారు. తెలుగు ప్రజల నైపుణ్యం ప్రపంచానికి చేరవేసిన దార్శనికుడు చంద్రబాబు అని వారు కొనియాడారు. లోకేశ్‌ను నిర్భందిచడాన్ని ప్రవాసాంధ్రులు తప్పుబట్టారు. దేశ రాజ్యాంగాన్ని అపహస్యం చేసేలా జగన్ మోహన్ రెడ్డి చర్యలున్నాయని ఎన్ఆర్ఐలు విమర్శించారు. జగన్ ప్రతిపక్షాల మీద దాడి చేయటంలో చూపే శ్రద్ధ రాష్ట్ర ప్రగతి మీద చూపిస్తే... రాష్ట్రానికి ఈ ఖర్మ పట్టేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.