Sri Ramsagar Project in Nizamabad : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి.. ప్రతి రోజు అర టీఎంసీ నీరు విడుదల
Full Capacity of Sriram Sagar Project in Nizamabad : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జీరో పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన.. శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం నుంచి ప్రాజెక్టులోకి నీటిని విడుదల కొనసాగుతోంది. ప్రతి రోజు అర టీఎంసీ చొప్పున అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 3927 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 1091 అడుగులు కాగా.. 1065 అడుగుల నీటిమట్టంతో సుమారుగా 21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీరాంసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. మొత్తం 42 గేట్లు ఉన్నాయి.
శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకంను ముఖ్యమంత్రి కేసీఆర్ 14 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. వర్షాకాలంలో వరద నీరు రానప్పుడు.. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని వెనక్కి తీసుకువచ్చి.. వరద కాలువ ద్వారా నీటిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కి మళ్లించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2017లో ప్రారంభించింది.