తెలంగాణ

telangana

Nizam College Students Protest On Road

ETV Bharat / videos

రోడ్డుపై బైఠాయించిన నిజాం కళాశాల విద్యార్థినులు - వసతి గృహంలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్ - ప్రిన్సిపాల్ పట్టించుకోవడంలేదని ఆవేదన

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 2:21 PM IST

Nizam College Students Protest On Road : వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. నిజాం కళాశాల విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. హైదరాబాద్ బషీర్​ బాగ్​లోని వసతి గృహం ముందు నిజాం కళాశాల ప్రిన్సిపాల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. విద్యార్థుల నిరసన వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

గత కొన్ని రోజులుగా హాస్టల్​లో నీటి కొరత సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు తెలిపారు. తమ సమస్యను ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు అనేక సమస్యలు ఉంటాయని.. వాటిని దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కరించకుండా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన ఆహారం అందించడం లేదని వాపోయారు. తక్షణమే ప్రిన్సిపాల్ తమ దగ్గరకు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించే లేదని తేల్చి చెప్పారు. సంఘటన స్థలానికి వచ్చిన డీసీపీ వెంకటేశ్వర్ విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details