Nirmal Viral Video : ఇద్దరు యువకులపై సర్పంచ్ భర్త దాడి.. వీడియో వైరల్ - నిర్మల్ జిల్లా
Sarpanch Husband Beating youths Video Viral :నిర్మల్ జిల్లా భైంసా మండలం కోతల్గాం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై ఆ గ్రామ సర్పంచ్ భర్త భూమేశ్ దాడి చేశాడు. హరీశ్, రాజశేఖర్ అనే ఇద్దరు యువకులను చితకబాదాడు. ముందుగా స్థానికంగా ఉన్న ఓ కిరాణా షాప్ వద్ద నిల్చుని ఉన్న యువకుడి వద్దకు వచ్చిన భూమేశ్.. అతడిపై దాడి చేశాడు. అక్కడే ఉన్న మరో యువకుడు ఇదంతా వీడియో తీశాడు. దీంతో ఆ యువకుడిపైనా భూమేశ్ దాడికి దిగాడు. వీడియో ఎందుకు తీస్తున్నావంటూ దుర్భాషలాడుతూ చావబాదాడు. స్థానికులు భూమేశ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వినకుండా ఇద్దరినీ విచక్షణా రహితంగా కొట్టాడు. సర్పంచ్ భర్త కావడంతో స్థానికులూ మిన్నకుండిపోయారు. తాము సర్పంచ్‌ను కానీ, భూమేశ్‌ను కానీ ఏమీ అనలేదని.. అనవసరంగా తమపై దాడి చేశాడని బాధిత యువకులు వాపోయారు. ఈ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ కావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.