గుర్రాలపై నిల్చొని స్వారీ- ఔరా అనిపించేలా నిహాంగ్ సిక్కుల విన్యాసాలు - పంజాబ్లో నిహాంగ్ సిక్కుల గుర్రపు స్వారీలు
Published : Nov 14, 2023, 11:17 AM IST
Nihang Sikh Horse Riding Stunts In Amritsar : బందీ చోడ్ దివస్ సందర్భంగా నిహాంగ్ సిక్కులు పంజాబ్లో గుర్రపు స్వారీ విన్యాసాలు ప్రదర్శించారు. కత్తులు, కర్రలు పట్టుకొని గుర్రాలపై అబ్బురపరిచే విన్యాసాలు చేశారు. 'గట్కా', 'గుర్రపు స్వారీ' ప్రదర్శనలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
అమృత్సర్లోని ఓ మైదానంలో బందీ చోడ్ దివస్ సందర్భంగా మొహల్లా మేళాను నిర్వహించారు. ఈ మేళాలో ఔరా అనిపించేలా సిక్కులు విన్యాసాలు చేశారు. ఒకేసారి రెండు, మూడు గుర్రాలపై స్వారీ చేశారు. కొంతమంది సిక్కులు గుర్రాలపై నిలబడి విన్యాసాలు చేశారు. అలానే సిక్కుల యుద్ధ కళ 'గట్కా' విన్యాసాలు ప్రదర్శించారు. నిహాంగ్ సిక్కుల గుర్రపు స్వారీ విన్యాసాలను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలో ఆరో సిక్కు గురువు హరవగోవింద్.. గ్వాలియర్ కోట నుంచి విడదలైన రోజును స్మరించుకునే సిక్కు వేడుక ఇది. దీపావళి తర్వాత రెండో రోజు ఈ మొహల్లా మేళాను నిర్వహించటం నిహాంగ్ సిక్కుల సంప్రదాయం.
TAGGED:
నిహాంగ్ సిక్కుల మొహల్లా మేలా