తెలంగాణ

telangana

వైరల్ అయిన ఉమేశ్​పాల్ హత్యవీడియో

ETV Bharat / videos

ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షిని వెంబడించి మరీ చంపిన దుండగులు - ప్రయాగ్‌రాజ్ హత్య కేసు

By

Published : Feb 25, 2023, 8:36 PM IST

ఉత్తరప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో ఓ హత్యకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసు ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ అనే వ్యక్తిని వెంబడించి మరీ చంపారు దుండగులు. ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేం సరాయ్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. పక్కా ప్రణాళికతో దుండగులు మర్డర్ ప్లాన్​ను ఎలా అమలు చేశారో వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

ట్రాఫిక్ ఆగిపోయిన వెంటనే తెల్లటి వాహనంలో నుంచి ముగ్గురు వ్యక్తులు కిందకు దిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. వెంటనే దుండగులు ఉమేశ్ పాల్‌పై కాల్పులు జరిపారు. దాంతో అతడు నేలపై పడిపోయాడు. అదే సమయంలో, ఒక పోలీసు వెంటనే నేలపై పడిపోయాడు. మరో పోలీసు కారులో ఉన్నాడు. కాల్పులు జరిపిన తర్వాత, నల్లకోటు ధరించిన ఉమేశ్ పాల్ తన ఇంటి లోపలికి పరిగెత్తాడు. ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరుపుతూ అతడి వెంటే వెళ్లారు. అదే సమయంలో, ఒక వ్యక్తి బ్యాగ్‌లో నుంచి బాంబులు తీస్తూ కారు చుట్టూ విసిరాడు. దీంతో కారు చుట్టూ పొగ వ్యాపించింది. బాంబు విసిరిన దుండగుడు సైతం నిందితులతో వెళ్లిపోయాడు. 

ABOUT THE AUTHOR

...view details