తెలంగాణ

telangana

మహారాష్ట్రలో రాణా దంపతుల 5రోజుల హోలీ టూర్

ETV Bharat / videos

నవనీత్​ రాణా దంపతుల హోలీ టూర్​.. గిరిజనులతో స్టెప్పులు.. టీ పెడుతూ.. - mp navneeth dance in melghat holi celebrations

By

Published : Mar 6, 2023, 1:02 PM IST

మహారాష్ట్ర సాత్పుర శ్రేణిలో నివసించే గిరిజనులకు హోలీ చాలా పెద్ద పండుగ. ఇక్కడి గిరిజన ప్రజలు ఈ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకొంటారు. అయితే వీరి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి ఎమ్మెల్యే రవి రాణా, ఎంపీ నవనీత్ రాణా మేల్​ఘాట్​లో 5 రోజుల టూర్​ను చేపట్టారు. రాణా దంపతులు మేల్​ఘాట్ ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో బైక్​పై తిరుగుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే తమ గ్రామాలకు రావడం వల్ల గిరిజన ప్రజలు ఎంతో సంతోషంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే ఈ దంపతులు అన్ని టెన్షన్లను మరిచి గిరిజనులతో కలిసి హోలీ పండుగను ఆనందంగా జరుపుకొంటున్నారు. రాణా దంపతులు వెళ్లే ప్రతి గ్రామంలో ప్రజలు వారికి ఘన స్వాగతం పలుకుతున్నారు. వీరి పర్యటనలతో మేల్​ఘాట్ మొత్తం హోలీ పండుగ సెలబ్రేషన్స్​తో కళకళలాడుతోంది. కౌ గ్రామంలోని గిరిజనులతో కలిసి డాన్స్ వేసి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు నవనీత్ రాణా. మారుమూల గ్రామమైన సవాలా చేరుకొని అక్కడ చిన్న హోటల్​లో టీ, బూందీ తయారు చేశారు నవ్​నీత్ రాణా. అనంతరం అక్కడే నవనీత్​ రాణా దంపతులు టిఫిన్​ చేశారు. దభియా గ్రామంలో రాణా దంపతులు డప్పులు వాయిస్తూ, డాన్స్ చేసి అందరిలో ఆనందాన్ని నింపారు. రవి రాణా డప్పులు వాయించగా, నవ్​నీత్ రాణా గిరిజన మహిళలతో కలిసి డాన్స్ చేశారు. అనంతరం మాట్లాడిన నవ్​నీత్ రాణా హోలీ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details