తెలంగాణ

telangana

Naveen Polishetty Visit Khairatabad Ganesh

ETV Bharat / videos

Naveen Polishetty Visit Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకొన్న నటుడు నవీన్ పొలిశెట్టి.. - Telangana latest news

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 9:25 PM IST

Actor Naveen Polishetty Visit Khirathabad Ganesh : తాను నటుడు అవ్వాలనే కోరిక వినాయక చవితి ఉత్సవాల్లోనే పుట్టిందని యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో చేసే హంగామా తనలోని నటుడికి కారణమైందన్నారు. గణేశ్ ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ మహాగణపతిని నవీన్ పొలిశెట్టి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవీన్​కు ఉత్సవ సమితి సభ్యులు సాధర స్వాగతం పలికి సత్కరించారు.

అనంతరం ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాల్లో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న నవీన్ పొలిశెట్టి.. తన తాజా చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి విజయవంతమైనందుకు గణేశుడికి ప్రత్యేకంగా పూజలు చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది కొలువుదీరిన విద్యా మహాగణపతి.. భక్తులకు మంచి విద్య, ఉన్నతస్థాయి కల్పించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. సినీ హీరో రాకతో ఖైరతాబాద్ గణేశుడి మండపం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఉత్సవ సమితి సభ్యులతోపాటు పలువురు భక్తులు పొలిశెట్టి​తో సెల్ఫీలు తీసుకుంటూ ఆనందించారు. అనంతరం తన అభిమానులకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details