Navaratri Celebrations in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు.. - Navaratri Celebrations in Telangana
Published : Oct 19, 2023, 1:58 PM IST
Navaratri Celebrations in Telangana :రాష్ట్ర వ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. ఓరుగల్లు శ్రీ భద్రకాళి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
మరోవైపు భద్రాచలంలోని రాములోరి క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకరణలో దర్శనమిస్తున్నారు. ధాన్యలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవరోజు మహాలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా వరదుర్గమాతను (మహాలక్ష్మి) పెసర రంగు వస్త్రంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. మహాలక్ష్మి రూపంలో భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్న నేపథ్యంలో ఆలయ అర్చకులు రూ. 20,50,100,200,500, రూపాయల నోట్లతో అమ్మవారిని విశేషాలంకరణ చేశారు.