తెలంగాణ

telangana

ఈజీగా బరువు తగ్గాలా..? ఈ హెల్దీ​ డ్రింక్స్​ తాగితే సరి!

By

Published : Mar 22, 2023, 5:51 PM IST

natural health drinks for weight loss

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారాన్ని తీసుకోవడమే కాకుండా జీవన శైలి కూడా ఆరోగ్యకరమైన రీతీలో ఉంచుకోవాలి. కానీ ఈ రెండు విషయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మనిషి ఒబెసిటీ సమస్యతో సతమతమవుతూ ఉంటున్నాడు. అందుకే ప్రతి ఒక్కరూ సరైన బీఎంఐను మెయింటైన్ చేయాలి. సాధారణ వ్యాయమాలతో పాటు డైటింగ్​ లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి వారు వెయిట్​ లాస్ కోసం వైద్యులు సూచించిన కొన్ని రకాల హెల్త్​ డ్రింక్​లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాను పొందవచ్చు. బరువు తగ్గించుకునేందుకు అత్యున్నత సాధనం తరుచూగా మంచి నీళ్లు తాగడం. తగినన్ని మంచినీళ్లు తీసుకోవడం బరువు తగ్గడానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తోంది. అలాగే భోజనానికి ముందు మంచి నీటిని తాగడం వల్ల అధిక కేలరీలు తీసుకోకుండా జాగ్రత్త పడవచ్చు. అధిక బరువును తగ్గించుకునేందుకు వంటింటి చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 

వివిధ రకాల హెల్త్​ డ్రింక్స్​ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బరువు తగ్గడానికి మరో అత్యుత్తమ మార్గం గ్రీన్​ టీ. ఇది మెటబాలిజం రేట్​ను పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అన్ని విధాల కాపాడుతుంది. ఈ గ్రీన్ ​టీని మన డైలీ మెనూలో చేర్చుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని నిపుణుల అభిప్రాయం. ప్రొటీన్ షేక్స్, కూరగాయల రసం బరువును తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. జీలకర్ర నీటితో ఒబెసిటీ సమస్యకు చెక్ పెట్టేయవచ్చు. ప్రతి పూట కాస్త జీలకర్రను నీళ్లలో నానబెట్టి నీటితో సహా వాటిని మరగబెట్టిన ఆ ద్రావణాన్ని పరిగడపున తీసుకోవడం వల్ల ఒబెసిటీ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. ప్రత్యేకించి తయారు చేసిన  హెల్త్​ డ్రింక్స్​ కంటే మనం ఇంట్లో లభించి పదార్థాలతో తయారు చేసుకున్న పానీయాలతో అద్భుతమైన ఫలితాలను అందుకోవచ్చు. అలానే.. తాగకూడని డ్రింక్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటి వివరాలు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. 

ABOUT THE AUTHOR

...view details