నిర్మాణంలోనే కుప్పకూలిన హైవే బ్రిడ్జి - భయాందోళనకు గురైన వాహనదారులు - Tummala on Collapsed Bridge
Published : Jan 18, 2024, 10:27 PM IST
National Highway Bridge Collapse in Khammam :ఖమ్మం జిల్లా వైరా సమీపంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా టూ మధిర రహదారిలో వాహనాల రాకపోకల కోసం గ్రీన్ఫిల్డ్ అధికారులు భారీ వంతెన నిర్మాణం చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి పనులు ప్రారంభం కాగా వంతెన స్లాబ్ సగం పూర్తయ్యాక ఒక్కసారిగా కుప్పకూలింది. భారీగా శబ్దం రావడంతో అటుగా ప్రయాణించే వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు.
Greenfield Highway Bridge Collapse in Khammam : ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. నిర్మాణ పనుల్లోనే నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వంతెన కూలిన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఈ మేరకు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.