తెలంగాణ

telangana

Narlapur Pump House Test Success

ETV Bharat / videos

Narlapur Pump House Wet Run Trial Success : నార్లాపూర్ పంప్​హౌస్ మొదటి పంపు​ వెట్​రన్​ ట్రయల్ విజయవంతం - పాలమూరు జిల్లా వార్తలు

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 11:04 AM IST

Narlapur Pump House Wet Run Trial Success :  పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా.. నార్లాపూర్ పంప్​హౌస్​లో మొదటి పంప్​ వెట్​రన్ ట్రయల్​ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 4 గంటల 48 నిమిషాలకు ఈ ట్రయల్ రన్ చేపట్టారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి నుంచి.. అధికారికంగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. 

Palamuru Rangareddy Project Inauguration Today : వెట్ రన్​ మొదలుపెట్టగానే.. శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్ రెగ్యులేటరీ, ఇంటెక్ వెల్, సొరంగ మార్గాల ద్వారా సర్జిపూల్​లోకి చేరిన కృష్ణా జలాలు, మొదటి పంపు నుంచి డెలివరీ మెయిన్స్​ను దాటుకొని డెలివరీ సిస్టర్న్​కి విజయవంతంగా చేరాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ సన్నాహక పరీక్ష పూర్తికావడంతో.. ఇంజినీరింగ్ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి , నాగర్ కర్నూల్ నీటి పారుదలశాఖ సీఈ హమీద్ ఖాన్ పర్యవేక్షణలో ఇంజినీరింగ్ అధికారులు ఈ సన్నాహక పరీక్షను నిర్వహించారు. మరోవైపు ఇవాళ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details