తెలంగాణ

telangana

LOKESH YUVAGALAM PADAYATRA

ETV Bharat / videos

లోకేశ్​ యువగళానికి అపూర్వ స్పందన.. ఆ విజువల్స్​ మీరు చూశారా..! - యువగళం పాదయాత్ర

By

Published : Apr 11, 2023, 1:43 PM IST

LOKESH YUVAGALAM PADAYATRA: రాష్ట్రంలోని ప్రజల సమస్యల పరిష్కారమే దిశగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో అడుగడుగునా ప్రజలు లోకేశ్​కు తమ మద్దతును తెలుపుతున్నారు. వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న యువనేత.. నేను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు. దారి పొడువునా పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రిలో 67వ రోజు యువగళం పాదయాత్ర సాగుతోంది. శింగనమల నియోజకవర్గం నుంచి తాడిపత్రిలోకి పాదయాత్ర ప్రవేశించింది. పాదయాత్రలో భాగంగా ఉదయం శింగనమల నియోజకవర్గం ఉలికుంట్లపల్లి విడిది కేంద్రం నుంచి లోకేశ్ నడక ప్రారంభించారు. పెద్దపప్పూరు మండలం సింగనగుట్టపల్లిలో.. లోకేశ్​కు జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. లోకేశ్​తో కలిసి తమ పాదం కదిపారు. తాడిపత్రి నియోజకవర్గంలో మత్స్యకారులు, రజకులు, చేనేతలు, బుడగజంగాలతో యువనేత లోకేశ్​ భేటీ అయ్యారు. 

ABOUT THE AUTHOR

...view details