తెలంగాణ

telangana

Nara_Bhuvaneshwari_Nijam Gelavali

ETV Bharat / videos

Nara Bhuvaneshwari 'Nijam Gelavali' Tour Updates: 'పార్టీ అండగా ఉంటుంది.. అధైర్యపడొద్దు'.. మృతుల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా - Chandrababu news

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 4:51 PM IST

Nara Bhuvaneshwari 'Nijam Gelavali' Tour Updates:చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో మనోవేదనకు గురై, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్ర రెండోరోజుకు చేరింది. మొదటి రోజు తిరుపతి జిల్లా నారావారిపల్లెలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన భువనేశ్వరి.. చంద్రగిరి నియోజకవర్గం అగరాలలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

Bhuvaneshwari Assured the Deceased Families: నారా భువనేశ్వరి పర్యటన రెండవ రోజు శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. నేటి పర్యటనలో.. తంగెళ్లపాలెంకు చెందిన మోడం వెంకటరమణ, కొనతనేరికు చెందిన గాలి సుధాకర్, కాసరంకు చెందిన వెంకటసుబ్బయ్య గౌడ్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కారణంగా మృతి చెందిన కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసానిచ్చారు. సాయంత్రం తిరుపతిలోని అంకుర ఆస్పత్రి సమీపంలో నిర్వహించనున్న సమావేశంలో భువనేశ్వరి పాల్గొని ప్రసంగించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details