Nandamuri Balakrishna Wiped Woman Tears: మహిళ కన్నీళ్లు తుడిచిన బాలకృష్ణ.. అధైర్యపడొద్దంటూ భరోసా - చంద్రబాబు అరెస్టుపై టీడీపీ కార్యకర్తల ఆందోళన
Published : Sep 11, 2023, 10:41 PM IST
Nandamuri Balakrishna Wiped Woman Tears: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రేయింబవళ్లు నిద్ర లేకుండా తమ అభిమాన నేత కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. గత రెండు రోజులుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది టీడీపీ నేతలు కార్యకర్తలకు ధైర్యంగా ఉండమని చెప్తూ.. కార్యకర్తలకు భరోసాను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. దీంతో తన బాధని ఆపుకోలేని ఓ మహిళ బాలకృష్ణని చూడగానే.. ఆయన్ని పట్టుకుని తీవ్రంగా రోధించారు. మహిళను ఓదార్చిన బాలకృష్ణ.. అధైర్య పడొద్దని ఆమెకు భరోసా ఇచ్చారు. ఆడపడుచుల కళ్లల్లో మళ్లీ ఆనంద భాష్పాలు వస్తాయని అన్నారు.. అయితే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత నుంచి పలువురు అభిమానులు, కార్యకర్తలు ప్రాణాలు సైతం వీడారు.