రాష్ట్రవ్యాప్తంగా నాగుల చవితి వేడుకలు - భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు - నాగుల చవితి లెటెస్ట్ న్యూస్
Published : Nov 17, 2023, 2:08 PM IST
Nagula Chavithi celebrations In Telangana :రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమకొండ వేయిస్తంభాల గుడిలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. కార్తీకమాసంలో వచ్చే నాగుల చవితికావడంతో మహిళలు ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్నారు. హుజూర్‌నగర్‌లో భక్తులు కార్తీక స్నానాలు ముగించుకొని.. స్వామివారిని దర్శించుకున్నారు. పుట్టలో పాలు పోసి, పసుపు కుంకుమను అర్చించి, మొక్కులు తీర్చుకున్నారు.
Nagula Chavithi celebrations :భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలంలోని ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పరకాలలోని శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో నాగదేవతకు భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాయి. అధిక సంఖ్యలో మహిళలు, పిల్లలు హాజరుతో దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. కార్తీక మాసంలో నాగుల చవితి రోజున నాగేంద్రుని పూజించడం వల్ల సర్పదోషాలు, పూర్వజన్మ పాపాలు తొలిగిపోతాయని భక్తుల విశ్వాసం.
TAGGED:
Nagula chavithi celebrations