సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అక్కినేని నాగార్జున దంపతులు - cm revanth nagarjuna meet
Published : Dec 30, 2023, 12:37 PM IST
|Updated : Dec 30, 2023, 12:55 PM IST
Nagarjuna couple Meets CM Revanth Reddy Today : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి ఫొటోలు దిగారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాగార్జున దంపతులు ఆయన్ను కలవడం ఇదే మొదటిసారి. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయటానికి పలువురు ప్రముఖులు కలుస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు దిశగా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టారు.
Akkineni Nagarjuna Latest Movie Updates : అక్కినేని హీరో నాగార్జున 'నా సామిరంగ' అనే సినిమాలో నటిస్తున్నారు. మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ గ్లింప్స్‌తో అందరిని ఆకట్టుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. యాక్షన్స్ సీన్స్‌తో ఆకట్టుకున్న సినిమా టైటిల్ గ్లింప్స్, సంక్రాంతికి నాగార్జున అభిమానులకు డబుల్ పండగే అని అంటున్నారు.