తెలంగాణ

telangana

Mysore Dasara Festival 2023

ETV Bharat / videos

Mysore Dasara Festival 2023 : మైసూర్​ ప్యాలెస్​లో ఘనంగా దసరా ఉత్సవాలు.. ఆయుధపూజ చేసిన యువరాజు - mysore dasara procession

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 10:44 AM IST

Updated : Oct 24, 2023, 11:32 AM IST

Mysore Dasara Festival 2023 : దసరా ఉత్సవాల సందర్భంగా మైసూర్ ప్యాలెస్​లో ఆయుధ పూజ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. తొలుత మైసూర్ యువరాజు​ యధువీర్ కృష్ణరాజ చామరాజ వడయార్ ప్యాలెస్​లోని కళ్యాణ మండపంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏనుగులకు, అశ్వాలకు, గోవులకు యువరాజు ప్రత్యేక పూజలు చేశారు. 

ముందుగా ఆయుధాలను సోమేశ్వరాలయం దగ్గరకు తీసుకువెళ్లి శుభ్రపరిచి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు నుంచి 12.45 గంటల వరకు ఆయుధ పూజ నిర్వహించారు. యువరాజు యధువీర్ తన వాహనాలకు కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఆ తదుపరి అంబావిలాసదత్త పూజ, అమలాదేవిని దర్శించుకున్నారు. ఇంతటితో నవమి పూజా కార్యక్రమాలు పూర్తవ్వనున్నాయి. కర్ణాటకలో పది రోజులపాటు దసరా వేడుకలు జరుగుతాయి. 

మైసూరులో దసరా ఉత్సవాలలో చివరిరోజైన మంగళవారం సాయత్రం 4గంటల 40 నిమిషాలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దసరా జంబూ సవారి ఊరేగింపు జరగనుంది. ఈ ఊరేగింపును కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రారంభించనున్నారు. రాత్రి 7.30 గంటలకు బన్నిమంటప మైదానంలో దసరా టార్చిలైట్ పరేడ్( పంజిన కవాతు) ఉంటుంది. 

Last Updated : Oct 24, 2023, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details