Muthireddy Yadagiri Reddy Reaction Jangaon MLA Ticket : 'జనగామ టికెట్ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తా' - Jangaon news
Published : Sep 23, 2023, 7:30 PM IST
|Updated : Sep 23, 2023, 7:39 PM IST
Muthireddy Yadagiri Reddy Reaction Jangaon MLA Ticket : జనగామ టికెట్‌పై శుక్రవారం ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంపై వస్తున్న ప్రచారాలన్నీ ఊహాగానాలుగా కొట్టి పారేశారు. జనగామ టికెట్(Jangaon Ticket)పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలిస్తున్నారని, పార్టీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని.. రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు. ఏ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ఆదేశాల మేరకు పని చేస్తానని చెప్పారు.
MLA Yadagiri Reddy Clarity on Jangaon MLA Ticket : తరిగోప్పుల మండలం బొత్తలపర్రె గ్రామంలో రూ.62కోట్లుతో గండి రామవరం రిజర్వాయర్ నుంచి బొత్తల్లపర్రె గ్రామం వరకు నూతనంగా నిర్మిస్తున్న పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేవాదుల ద్వారా సమృద్ధిగా త్రాగు, సాగునీరు అందిస్తున్నందున.. వలస వెళ్లిన వారు తిరిగి గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. కాలువ నిర్మాణానికి సహకరించి భూములను అందించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. తరిగోప్పులను కొత్త మండలంగా ఏర్పాటు చేసుకోవడంతో ఎంతగానో అభివృద్ధి చెందిందని హర్షం వ్యక్తం చేశారు.