తెలంగాణ

telangana

Mukesh Ambani Family At Ganesh Temple

ETV Bharat / videos

Mukesh Ambani Family At Ganesh Temple : గణపయ్య సేవలో ముకేశ్​ అంబానీ ఫ్యామిలీ.. వినాయకుడి పాదాల వద్ద..

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 7:48 AM IST

Mukesh Ambani Family At Ganesh Temple : ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ కుటుంబసభ్యులు గణనాథుడి సేవలో తరించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలోని ముంబయిలో కొలువుదీరిన సిద్ధివినాయకుడికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్​ అంబానీ, కుమార్తె ఈశాతో ముకేశ్​ అంబానీ ఆలయానికి వెళ్లారు. ఈశా కవల పిల్లలు ఆదియా, కృష్ణను కూడా తమ వెంట తీసుకెళ్లారు.

బొజ్జ గణపయ్య పూజ కోసం ప్రత్యేకమైన పళ్లాల్లో పండ్లు, పువ్వులను తీసుకెళ్లారు అంబానీ కుటుంబసభ్యులు. ఏకదంతుడికి నైవేద్యంగా భారీ సైజు లడ్డూను సమర్పించారు. అంబానీ కుటుంబసభ్యులకు ఆలయ పూజారులు శాలువాలతో సత్కరించారు. ఈశా కవల పిల్లలను.. స్వామి వారి పాదాల దగ్గర పెట్టి ఆశ్వీరాదాలు ఇప్పించారు. ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబం కావడం వల్ల భారీ భద్రత నడుమ వినాయకుడిని అంబానీ ఫ్యామిలీ దర్శించుకుంది. వీరి రాకతో కాసేపు సాధారణ భక్తుల దర్శనాలను నిలిపివేశారు ఆలయ అధికారులు.

ABOUT THE AUTHOR

...view details