తెలంగాణ

telangana

MP Santhosh Kumar Distributes Seed Ganesh Idols

ETV Bharat / videos

MP Santhosh Kumar Distributed Seed Ganesh Idols : విత్తన గణపతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి: ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్ - Green India Challenge Distribution Ganesha idols

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 1:51 PM IST

MP Santhosh Kumar Distributed Seed Ganesh Idols: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను ప్రతిష్టించి పూజించాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్‌కుమార్ పేర్కొన్నారు. కూకట్​పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోని నెక్సస్ మాల్​లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఆయన చిన్నారులకు సీడ్ గణేశ్ ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు గణపతి నవరాత్రులు అంటే చాలా ఇష్టమని, సీడ్ గణేశ్ ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో చిన్నారులతో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కల్మషం లేని చిన్నారుల మనసులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా సామాజిక బాధ్యతను నేర్పుతున్నందుకు చాలా గర్వంగా ఉందని ఎంపీ సంతోశ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పుష్ప సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ధ్రువన్ పేర్కొన్నారు. తనకు వినాయకచవితి పండగ అంటే చాలా ఇష్టమని.. ఇలాంటి పండగలో సీడ్ గణేషుడి ద్వారా భక్తి, ప్రకృతికి మేలు చేసేలా విత్తనాలను కలిపి అందించడం చాలా ఇన్స్‌పిరేషన్ కలిగించిందన్నారు. ప్రతి ఒక్కరూ సీడ్ గణేశ్​లను ప్రతిష్టించాలని, మొక్కలు నాటాలని కోరుకుంటున్నానని తెలిపారు. కార్యక్రమంలో గో రూరల్ ఇండియా లిమిటెడ్ సీఈవో సునీల్, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details