తోపుడు బండిపై భార్యను ఆస్పత్రికి తరలించిన వృద్ధుడు.. ఐదు కిలోమీటర్లకు పైగా.. - మధ్యప్రదేశ్ సకాలంలో స్పందించని అంబులెన్స్ సర్వీస్
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో హృదయ విదారకర ఘటన వెలుగుచూసింది. సకాలంలో అంబులెన్స్ నిర్వాహకులు స్పందించకపోవడం వల్ల అనారోగ్యానికి గురైన వృద్ధురాలిని ఆమె భర్త.. తోపుడుబండిపై పడుకోబెట్టి ఆస్పత్రికి చేర్చిన ఘటన కన్నీరు పెట్టిస్తోంది. ఎండలో ఐదు కిలోమీటర్లు బండిని తోసుకుంటూ వృద్ధుడు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. దారి మధ్యలో కనీసం ఒక్కరు కూడా అతడికి సాయం చేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST