MP Laxman Reaction on Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ సబబు కాదు : లక్ష్మణ్ - చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడిన ఎంపీ లక్ష్మణ్
Published : Sep 11, 2023, 5:30 PM IST
MP Laxman Reaction on Chandrababu Arrest : ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ సబబు కాదని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ ఈ అరెస్టును తప్పుబడుతోందని తెలిపారు. ఆయనను ఎలాంటి వివరణ లేకుండా అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఎఫ్ఐఆర్లో పేరు చేర్చలేదని మండిపడ్డారు. చంద్రబాబు(Chandrababu)ను ఏపీ సీఐడీ పోలీసులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి పోలీసులు తరలించారు.
MP Laxman Speech on Jamili Elections : కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు జరిపేందుకు సన్నాహాలు వేగంగా చేస్తోందని తెలిపారు. మాజీ రాష్ట్రపతి నివేదిక వచ్చిన అనంతరం.. పార్లమెంట్లో బిల్లు పెట్టి అందరి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. మార్చి లేదా ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్లో జరుగుతాయని చెప్పారు.