తెలంగాణ

telangana

MP Laxman Fires On Congress Government

ETV Bharat / videos

కాళేశ్వరం స్కామేశ్వరంగా మారిపోయింది - బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ వెళ్తోంది : లక్ష్మణ్ - laxman on kaleshwaram

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 5:01 PM IST

MP Laxman Fires On Congress Government : బీఆర్ఎస్​ హయాంలో కాళేశ్వరం స్కామేశ్వరంగా మారిపోయిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం నిర్మాణంలో అనేక తప్పిదాలు, పొరపాట్లు జరిగాయని ప్లానింగ్, డిజైన్​కు విరుద్దంగా నిర్మాణం జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టు వైఫల్యానికి గత ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలే కారణమన్న ఆయన, రాష్ట్ర సంపదంతా దోపిడీకి గురైందన్నారు. కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని నిలదీశారు. కాళేశ్వరం, మేడిగడ్డ ఘటనల్లో ఏ ఒక్కరిపై చర్యలెందుకు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.

గతంలో ఈ విషయంలో సీబీఐ విచారణ కోరిన రేవంత్ రెడ్డి, ఇప్పుడెందుకు వారి విచారణపై నోరు మెదపడం లేదని లక్ష్మణ్​ ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రజల కళ్లల్లో మట్టి కొట్టేందుకు చూస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ వెళ్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని, లేదంటే కాంగ్రెస్​ను కూడా ప్రజలు దోషిగా నిలబెడతారని జోస్యం చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details