తెలంగాణ

telangana

MP Laxman on Ayodhaya Ram Mandir Inauguration

ETV Bharat / videos

గుడిని శుభ్రం చేసిన ఎంపీ లక్ష్మణ్ - ప్రతిఒక్కరు పాల్గొనాలని పిలుపు - MP Laxman Cleans Temple in hyd

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 5:30 PM IST

MP Laxman Cleans Temple in Hyderabad : అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఆలయాలను శుభ్రం చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ అశోక్​నగర్‌లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పరిసరాలను ఇవాళ ఆయన శుభ్రం చేశారు. 500 ఏళ్ల తర్వాత రామ మందిర నిర్మాణం మోదీ నాయకత్వంలో చేపట్టడం గర్వించదగ్గ పరిణామం అన్నారు. ఈనెల 22న అందరూ తమతమ ఇళ్ల ముందు దీపాలను వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. 

MP Laxman on Ayodhaya Ram Mandir Opening  : అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో శ్రమదానం నిర్వహించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా రామ భక్తులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. కొందరు రామ నామ టాటూలను ఉచితంగా వేస్తున్నారు. మరికొందరు తమ భక్తిని చాటుకునేందుకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాగా జనవరి 16వ తేదీ నుంచి ఆలయ ప్రారంభోత్సవాలు మొదలవుతాయి. 

ABOUT THE AUTHOR

...view details