తెలంగాణ

telangana

MP Komati Reddy Venkat Reddy Latest Comments

ETV Bharat / videos

'తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 100 స్థానాల్లో విజయదుందుభి మోగిస్తాం' - ఎంపీ కోమటిరెడ్డితో ముఖాముఖి

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 7:10 PM IST

MP Komati Reddy Venkat Reddy Latest Comments : శాసనసభ ఎన్నికల్లో 100 స్థానాల్లో విజయదుందుభి మోగిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌నేత, నల్గొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో హామీలు ఇచ్చి.. వాటిని నెరవేర్చకుండా బీఆర్​ఎస్​ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. నామినేషన్​ వేయడానికి తనతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. 

రాష్ట్రంల కాంగ్రెస్​ పార్టీ సునామీలా దూసుకుపోతుందన్నారు. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వాలు పోవాలన్నదే వారి లక్ష్యమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రూ.లక్షా 70వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఈ నెల 25, 26న కాంగ్రెస్​ అగ్రనేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనే నల్గొండ రోడ్​ షోని విజయవంతం చేయాలని కోరారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగుల గురించి మొదటి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details