వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలి : ఎంపీ ధర్మపురి అర్వింద్
Published : Jan 6, 2024, 4:17 PM IST
MP Dharmapuri Arvind participate in Vikas Bharat Sankalpa Yatra Programme : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రీ గ్రామంలో జరిగిన వికాస్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు స్థానిక గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణలో అమలు చేయబడుతున్న పథకాలకు సంబంధించిన వీడియోలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఉన్న క్యాలెండర్‌ను విడుదల చేశారు.
అనంతరం ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణలో అమలవుతున్న పథకాలను వివరించారు. రేషన్ కార్డుల దరఖాస్తుకు పరిమితి లేదని, అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాబోయే ఐదు సంవత్సరాలు ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఇన్యూరెన్స్ స్కీంల ద్వారా అందుతున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రైతులను ఆదుకునేందుకు కిషన్ సమ్మాన్ నిధి ద్వారా వ్యవసాయ సేవకు నిధులు అందిస్తున్నట్లు వివరించారు.