తెలంగాణ

telangana

MP Bandi Sanjay Temple Cleaning

ETV Bharat / videos

రాముని అక్షింతల కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదు : బండి సంజయ్ - Bandi Sanjay on Ayodhya Ram Mandir

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 6:00 PM IST

MP Bandi Sanjay Temple Cleaning : రాముని అక్షింతల కార్యక్రమాన్ని రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్​ అన్నారు. ఆలయ పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఇవాళ కరీంనగర్‌ పద్మనగర్‌లోని బండి సంజయ్ రామాలయంతో పాటు శివాలయాన్ని ​శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.  

Bandi Sanjay on Ayodhya :ప్రధాని మోదీ, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు బండి సంజయ్ తెలిపారు. అక్షింతల్లో బాస్మతి బియ్యం, రేషన్ బియ్యం ఉండవని, ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వారు తమ కుటుంబ సభ్యులను అడిగితే అక్షింతల పవిత్రత ఏమిటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఈ నెల 22న అయోధ్యలో జరిగే ఆలయ ప్రాణప్రతిష్ఠను కళ్లారా వీక్షించేందుకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details