MP Asaduddin on Telangana Elections : ఈసారి ఎన్నికల్లో కూడా కేసీఆర్‌దే విజయం: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ - కేసీఆర్‌పై మాట్లాడిన ఎంపీ అసదుద్దీన్
Published : Oct 9, 2023, 7:51 PM IST
MP Asaduddin on Telangana Elections : ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం ఉందని... ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి, మతసామరస్య పరిరక్షణలో మేటిగా నిలిచిన తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్తో పొత్తుకు వెళుతుందని తెలిపారు. తమ పార్టీ నాయకులు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కచ్చికంగా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ పార్టీ నాయకులు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది త్వరలో నిర్ణయించుకున్నామని తెలిపారు. ఓటర్లు బీజేపీ నాయకుల నుంచి జాగ్రత్తగా ఉండాలనీ అసదుద్దీన్ సూచించారు. తెలంగాణలో బీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ అధికారంలోకి రాదన్నారు. పదేళ్ల నుంచి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అందరు చూస్తున్నారని... కేసీఆర్ చేసిన అభివృద్ధే ఆయనను గెలిపిస్తుందని అసద్ ధీమా వ్యక్తం చేశారు.