తెలంగాణ

telangana

BJP Followers meeting in koratla

ETV Bharat / videos

'గెలుపు దగ్గరి దాకా వచ్చి ఓడిపోయాం - అసెంబ్లీ ఎన్నికల్లో నైతిక విజయం మనదే'

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 6:56 PM IST

MP Arvind on Assembly Elections Results: డబ్బులు పంచకుండానే 62 వేల ఓట్లను స్వచ్ఛందంగా సాధించి, నైతిక విజయం మనమే సాధించామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కోరుట్ల నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలకు రాష్ట్రంలో బీజేపీ బలపడిందని భరోసానిచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయామని ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రజల మెప్పు పొంది గెలుపు దగ్గరకు వచ్చామని పేర్కొన్నారు.

MP Arvind Distribute Checks to BJP Followers : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు మనదేననే నమ్మకం కార్యకర్తలకు వచ్చిందని అర్వింద్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని, సమష్టిగా ముందుకెళ్లి బీజేపీని పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మృతి చెందిన పలువురు బీజేపీ బూత్ స్థాయి నాయకుల సంబంధిత కుటుంబీకులకు అరవింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేశారు.

ABOUT THE AUTHOR

...view details