తెలంగాణ

telangana

Arvind

ETV Bharat / videos

MP Arvind Fires On BRS Minister Prashanth Reddy : మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ అర్వింద్‌ మధ్య మాటల యుద్ధం - నిజామాబాద్​ వార్తలు

By

Published : Jul 18, 2023, 1:19 PM IST

MP Arvind Fires on Minister Vemula Prashanth Reddy : కేంద్రం నిధులతో చేసిన పనుల విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మంత్రి ప్రశాంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖలో కేంద్రం ఇచ్చిన నిధులతో పనులు చేసి కేంద్రం పేరు పెట్టలేదని.. ఇతర నిధులతో పనులు చేసినట్టు శిలా ఫలకాల్లో పేర్కొంటున్నారని... ఈ పనుల్లో డబుల్ బిల్లింగ్ ద్వారా రూ.5 వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. అయితే అర్వింద్ వ్యాఖ్యల్లో నిజం లేదని.. నిధులు దారి మళ్లించలేదని ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. డబుల్ బిల్లింగ్ విషయంలో.. సీబీఐ విచారణకైనా సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. అమ్మానాన్నల గురించి ప్రశాంత్ రెడ్డి వాడిన పదాలపై అర్వింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడితే రాజకీయ జీవితం శూన్యం అవుతుందని హెచ్చరించారు. కేంద్ర నిధులతో పనులు చేసినట్టు ఒప్పుకున్న మంత్రి... పేరేందుకు మర్చాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. బట్టాపూర్ క్వారీ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీబీఐ విచారణకు సిద్ధమని అంటున్న ప్రశాంత్ రెడ్డి.. రాష్ట్రంలో ఆ సంస్థకు అనుమతి నిరాకరణను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details