కోతుల బెడద అరికట్టే వారికే మా ఓటు - ఫ్లెక్సీలతో వినూత్న నిరసన - An innovative protest to save from monkeys news
Published : Nov 29, 2023, 10:36 AM IST
Monkeys Destroying Crops In Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన ఓరైతు.. కోతుల నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు వినూత్నంగా నిరసన చేపట్టాడు. ప్రతి నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు వానరాలతో ఇబ్బంది పడుతున్నారని దామోదర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వరి, మొక్కజొన్న, మినుము, వేరుశనగ పంటలను కోతులు నాశనం చేస్తున్నాయని, వాటిని కొట్టబోతే మనుషుల మీదికి దాడికి దిగుతున్నాయని వాపోయాడు.
An Innovative Protest To Save From Monkeys: ఆరుగాలం కష్ట పడి పండించిన పంటలను కోతులు ధ్వంసం చేస్తున్నాయని దామోదర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇళ్లలోకి సైతం వస్తున్నాయని తన బాధను తోటి రైతులతో కలిసి నిరసన రూపంలో తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవట్లేదని వాపోయాడు. తమ ప్రాంతంలో కోతులను అరికట్టడానికి చర్యలు చేపట్టే అభ్యర్థికే తాము ఓటు వేస్తామని ఊరూరా తిరుగుతూ నిరసన తెలుపుతున్నాడు దామోదర్.