Money Stolen From Parked Car Viral Video : పార్క్ చేసిన కారులోని రూ.13 లక్షలు చోరీ.. పట్టపగలే అద్దం పగలగొట్టి.. - కారు అద్దం పగలగొట్టి దొంగలించిన వ్యక్తి
Published : Oct 23, 2023, 3:43 PM IST
Money Stolen From Parked Car Viral Video : రోడ్డుపై పార్క్ చేసి ఉన్న కారులోని రూ.13 లక్షలు చోరీ చేశాడు ఓ వ్యక్తి. కారు అద్దం పగలగొట్టి లోపలకు చొరబడి మరీ డబ్బును దొంగలించాడు. అక్కడే ద్విచక్రవాహనంపై ఉన్న మరో వ్యక్తితో వెంటనే పరారయ్యాడు. కర్ణాటకలోని బెంగళూరులో పట్టపగలే ఈ ఘటన జరగడం గమనార్హం.
పక్కా ప్లాన్‌తో చోరీ!
Money Stolen From Car : ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోను బెంగళూరు పోలీసులు.. సోమవారం విడుదల చేశారు. సెప్టెంబరు 20వ తేదీన ఈ చోరీ జరిగినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే చోరీకి పాల్పడేందుకు నిందితుడు పక్కా ప్లాన్ వేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
కారులో ఉన్న డబ్బు సంచిను దొంగలించేందుకు వచ్చిన నిందితుడు.. అక్కడే కాసేపు అటూఇటూ తిరగాడు. జనసంచారం లేని సమయంలో ఒక్కసారిగా తాను తెచ్చుకున్న చిన్నపాటి ఆయుధంతో కారు అద్దం పగలగొట్టాడు. ఆ తర్వాత డ్రైవర్ పక్క సీటులో ఉన్న బ్యాగ్‌ను చోరీ చేసేందుకు నిందితుడు.. ఎగిరి మరీ కారులోకి చొరబడ్డాడు. వెంటనే డబ్బుల బ్యాగ్‌ను తీసుకుని.. అక్కడే బైక్‌పై ఉన్న మరో వ్యక్తితో కొన్ని సెకన్లలోనే పరారయ్యాడు.