Moharram celebrations in Hyderabad : మొహర్రం ఊరేగింపునకు సర్వం సిద్ధం.. పాతబస్తీలో ట్రాఫిక్ అంక్షలు - Hyderabad Latest News
Moharram celebrations in the old city : హైదరాబాద్‌లోని పాతబస్తీలో మొహర్రం ఊరేగింపునకు సర్వం సిద్ధమయ్యాయి. అంబారీపై బీబీ కా ఆలం ఊరేగింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంబారీ ఊరేగింపు డబీర్పుర నుంచి ప్రారంభమై చాదర్ఘాట్ వరకూ కొనసాగనుంది. దాదాపు 7 కిలోమీటర్ల మేర ఊరేగింపు జరగనుంది. అంబారీ ఊరేగింపు యాత్రలో దాదాపు 2వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటుగా.. టాస్క్ఫోర్స్, క్రైమ్టీమ్స్, షీ టీమ్స్, ట్రాఫిక్ పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. ఊరేగింపు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ముస్లింలు హాజరై.. తమ సంప్రదాయాలు, ఆచారాలను పాటించనున్నారు. ఊరేగింపు యాత్ర డబీర్పుర బీబీ కా ఆలం నుంచి మొదలై షేక్ ఫైజ్ కామన్, ఇత్తెబర్ చౌక్, అలిజా కోట్ల, చార్మినార్, పంజేష, మీరాలం మండి, పురాని హావేలి, దారుల్ శిఫా, కాలి ఖబర్ , చాదర్ఘాట్ మస్జిద్ ఏ ఇలాహి వరకు కొనసాగుతుంది.