ఫోన్ దొంగను చితకబాదిన యువతి.. వీడియో వైరల్ - హరియాణా న్యూస్
హరియాణా సోనీపత్‌లో దొంగను చితకబాదింది ఓ యువతి. స్కూటీపై వచ్చిన ముగ్గురు దొంగలు.. రోడ్డుపై వెళ్తున్న యువతి వద్ద నుంచి ఫోన్ దొంగిలించి పారిపోయారు. అప్రమత్తమైన యువతి కేకలు వేయడం వల్ల స్థానికులు.. దొంగలను పట్టుకున్నారు. దీంతో యువతి సహా స్థానికులు దొంగను దాదాపు 40 నిమిషాల పాటు చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగను ఖేవ్డాకు చెందిన రింకూ సింగ్‌గా గుర్తించారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST