తెలంగాణ

telangana

MLC Kavitha visiting Mulugu Sammakka and Saralamma

ETV Bharat / videos

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి : ఎమ్మెల్సీ కవిత - ఎమ్మెల్సీ కవిత

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 10:22 PM IST

MLC Kavitha visiting Mulugu Sammakka and Saralamma :ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని గిరిజన దేవతలు సమ్మక్క-సారలమ్మలను బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. అనంతరం ఆమె మొక్కులను చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్​, ఎంపీ మాలోత్​ కవిత, ఎంపీ పసునూరి దయాకర్​ అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరికి పార్టీ శ్రేణులు గిరిజన సాంప్రదాయాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన కవిత సమ్మక్క-సారక్కలకు ప్రత్యేక పూజలు చేశారు.

Medaram Jatara at Mulugu : మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు. గత ప్రభుత్వం 2022 జాతరలో భక్కుల సౌకర్యార్థం 3,800 ప్రత్యేక బస్సులను నడిపిందని గుర్తు చేశారు. ప్రతి జాతరకు భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లను ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కోరారు. దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర తెలంగాణలోని ములుగు జిల్లాలోని మేడారంలో జరగడం చాలా సంతోషమని ఆనందించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details