తెలంగాణ

telangana

MLC Kavitha on Medaram Festival Arrangements

ETV Bharat / videos

ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి : ఎమ్మెల్సీ కవిత - Kavitha on Six Guarantees

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 1:04 PM IST

MLC Kavitha on Medaram Festival Arrangements : ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హనుమకొండ జిల్లాలో ఆమె మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యాలు కల్పించాలని కోరారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని గతంలో కేంద్రానికి నివేదించామన్నారు.

MLC Kavitha on Congress Six Guarantees: ఆరు గ్యారంటీల విషయంలో ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తెలిపారు. అమలు కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రజలకు పెన్షన్లు, రైతు బంధు ఇంకా రాలేదని మండిపడ్డారు. జనవరి 1 తర్వాత అయినా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ అధికారంలోకి రాలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశ పడొద్దని సముదాయించారు.

ABOUT THE AUTHOR

...view details