తెలంగాణ

telangana

MLC Kavitha on Nominated Quota MLCs Names Rejection

ETV Bharat / videos

MLC Kavitha on Governor Tamilisai 2023 : 'ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ తమిళిసై వ్యవహరించారు'

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2023, 11:55 AM IST

MLC Kavitha on Governor Tamilisai 2023  :నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్‌ తిరస్కరించడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తమిళిసై సౌందరరాజన్ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వం పంపిన జాబితాను ఆమోదించడం సంప్రదాయమన్న ఆమె.. సర్కార్ పంపిన పేర్లను అనేక కారణాలు చెప్పి తిరస్కరించారని తెలిపారు.

MLC Kavitha on Nominated Quota MLCs Rejection: రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తుందా.. లేక బీజేపీ రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నించారు. పలు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలిని ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారన్న కవిత.. గవర్నర్లే ఇలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. రాజ్యాంగ వ్యవస్థలకు పరిధులు, పరిమితులు ఉంటాయన్న ఆమె.. బీసీ వర్గాలకు తమ పార్టీ పెద్ద పీట వేస్తోందని వెల్లడించారు. ఈ క్రమంలోనే బీసీ వ్యతిరేక పార్టీ అని బీజేపీ మరోసారి నిరూపించుకుందని విమర్శించారు.

Kavitha Fires on Governor Tamilisai : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ కింద దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణల అభ్యర్థిత్వాలను ఆమోదించాల్సిందిగా ప్రభుత్వం గవర్నర్‌ను కోరగా.. ఆ సిఫారసులను తమిళిసై సోమవారం రిజెక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. సర్వీస్ సెక్టార్‌లో ఈ ఇద్దరు ఎలాంటి సేవలు చేయలేదని.. ఈ కోటా కింద నామినేట్ చేయడం కుదరదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details