ఆయన రాహుల్ గాంధీ కాదు, ఎలక్షన్ గాంధీ - ఆ విషయంలో అట్టర్ ప్లాఫ్ : ఎమ్మెల్సీ కవిత - ఇండియా కూటమిపై మండిపడ్డ కవిత
Published : Dec 25, 2023, 5:09 PM IST
MLC Kavitha fires on Rahul Gandhi : ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్న ఇండియా (INDIA) కూటమిలోని పార్టీలను అధినేత రాహుల్ గాంధీ ఎందుకు నిలువరించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఆ కూటమిలోని పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు.
MLC Kavitha Comments on INDIA Group :రాహుల్‌గాంధీని ఎలక్షన్ గాంధీగా ఆమె అభివర్ణించారు. అన్ని రాష్ట్రాలను ఏకం చేస్తానన్న ఎలక్షన్ గాంధీ తమ కూటమిలోని నాయకుల మాటలను అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆమె ఎద్దేవా చేశారు. హస్తం పార్టీ అంటేనే మభ్యపెట్టే మాటలని, మోసం చేసే పార్టీ అని ఆమె విమర్శించారు. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హిజాబ్ రద్దు చేస్తామని ఎన్నికల్లో మేనిఫెస్టోగా తీసుకొచ్చారని, కానీ ఇంతవరకూ రద్దు చేయలేదన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలు హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు ప్రజల్లో నుంచి వ్యతిరేకతలు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ స్పందించలేదని పేర్కొన్నారు.