తెలంగాణతో బీఆర్‌ఎస్‌కు ఉన్నది పేగు బంధం : ఎమ్మెల్సీ కవిత - కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
Published : Nov 19, 2023, 4:24 PM IST
MLC Kavitha Fires on Congress :అధికారం శాశ్వతం కాదు.. అనుబంధం శాశ్వతంగా ఉంటుందని.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఉన్నది పేగు బంధమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం స్థానిక బ్రాహ్మణ్ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన పట్టణ మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్లు అవకాశం ఇస్తే పేద ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించలేకపోయారని ఆమె విమర్శించారు. సంక్షేమ పథకం కింద ఒక్క రూపాయి పింఛన్ ఇవ్వలేక పోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. 2014లో తెలంగాణ వచ్చినప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. మళ్లీ బీఆర్‌ఎస్, కొప్పుల ఈశ్వర్‌ను గెలిపిస్తే పింఛన్‌ను రూ.2000 నుంచి రూ.5000లకు పెంచుతామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.