కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు : కవిత - కాంగ్రెస్‌పై మండిపడ్డ కవిత
Published : Nov 11, 2023, 3:27 PM IST
MLC Kavitha Comments on BC Declaration :కాంగ్రెస్‌ను గెలిపించిన కర్ణాటక ప్రజలు గోస పడుతున్నారని.. ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. నిజామాబాద్‌లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కవిత.. నిన్న కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై విమర్శలు గుప్పించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య.. సీఎం కేసీఆర్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
Kavitha fires on Congress :కర్ణాటక రైతులకు విద్యుత్ సరఫరా చేయకపోవడంలో కాంగ్రెస్ విఫలమైందని.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అక్కడి రైతులు దుమ్మెత్తిపోస్తున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న జనరల్ నియోజకవర్గ స్థానాలకు బీసీ అభ్యర్థులను ప్రకటించకుండా.. బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రేవంత్‌రెడ్డి అక్కడి స్థానాలకు టికెట్లను అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు ఒక సీటు కూడా కేటాయించని కాంగ్రెస్.. బీసీ ప్రజలను ఏం పట్టించుకుంటారని విమర్శించారు. కాంగ్రెస్ మాయమాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో మూడోసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్కే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.