తెలంగాణ

telangana

MLC Kavitha Video Song

ETV Bharat / videos

MLC Kavitha Bathukamma Song : 'అవనిపై గౌరీదేవి బతుకమ్మై వెలసిందో ఓ సందామావయ్యా'.. ఎమ్మెల్సీ కవిత పాడిన బతుకమ్మ పాట విన్నారా..? - ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పాట

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 12:27 PM IST

MLC Kavitha Bathukamma Song : ఈ ఏడాది సద్దుల బతుకమ్మ రోజున మహిళలు ఆడి పాడేందుకు మరో పాట వచ్చేసింది. మంచు మొగ్గలై మల్లె పొదల పూల ఏరుల్లో మన సందా మావయ్యా..! అవనిపై గౌరీదేవీ బతుకమ్మై వెలసిందో ఓ సందామావయ్యా..! ముసిముసి నవ్వులతో మురిసే పువ్వులు చూసి మురిసిండ్రో అంటూ సాగిన బతుకమ్మ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం.. మన తెలంగాణ ఆత్మగౌరవ సంబురం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులంతా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటున్నారు.

ఈ బతుకమ్మ పండగ కోసం స్పెషల్​గా కంపోజ్​ చేసిన బతుకమ్మ వీడియో సాంగ్​లో ఎమ్మెల్సీ కవిత తన గాత్రంతో ఆకట్టుకున్నారు. యువతులతో కలసి గొంతు కలిపి పాట పాడారు. ఒక్కొక్క ముత్యం నేనోముకుందూ.. గౌరీ గద్దె పీట నేనోముంకుందూ.. గంధపక్షంతలు నేనోముకుందూ.. అంటూ కవిత పాట పాడారు. ఈ వీడియోలో ఆమె పాట పాడుతూ కనిపించడమే కాకుండా.. బతుకమ్మ పేరుస్తూ కూడా కనిపించారు. పచ్చని తెలంగాణ పల్లెటూరులో ఈ వీడియోను షూట్ చేశారు. సంప్రదాయ దుస్తుల్లో పుత్తడి బొమ్మల్లా తయారైన అమ్మాయిలు.. తెలంగాణ పల్లె సోయగాలు.. మరోవైపు బతుకమ్మ పూలతో ఈ వీడియో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ABOUT THE AUTHOR

...view details