కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలే - చరిత్ర సృష్టించాలే : కవిత - తెలంగాణ అభివృద్ధిపై కవిత
Published : Nov 16, 2023, 7:20 PM IST
MLC Kavitha At Korutla Election Campaign : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు రాష్ట్ర వ్యాప్తంగా 100 సీట్లు వస్తాయని.. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం అవుతారని ఎమ్మెల్సీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కోరుట్ల అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి గండి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.. తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి ఇతర పార్టీలు ఇక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏమీ లేనప్పుడు ఏ పార్టీ తెలంగాణలోకి రాలేదని.. దేశంలో నంబర్ వన్ స్థానానికి రాగానే అన్ని పార్టీల వారు రాష్ట్రానికి వస్తున్నారని మండిపడ్డారు. కోరుట్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి అందరూ గుర్తు చేసుకోవాలని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు, మహిళలకు, అన్ని వర్గాల వారికి చేదోడుగా ఉన్నారని పేర్కొన్నారు.