తెలంగాణ

telangana

ETV Bharat / videos

MLC Kaushik reddy fires on Eetala : 'ఈటలవి హత్యా రాజకీయాలు.. ఓటమి భయంతో నిరాధారమైన వ్యాఖ్యలు' - Etala Rajender

🎬 Watch Now: Feature Video

kaushik reddy

By

Published : Jun 27, 2023, 6:57 PM IST

MLC Kaushik reddy on Eetala Rajender : ఈటల రాజేందర్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నాననడం పెద్ద జోక్ అని ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి అన్నారు. ఈటల దంపతులు చెప్పినవన్నీ అబద్ధాలేనని.. తనపై ఆరోపణలపై హుజురాబాద్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. తనను హత్య చేసే ఉద్దేశంతోనే.. ముందే బట్టకాల్చి మీదేస్తున్నారన్నారు. హత్య రాజకీయాలు చేసేది ఈటల రాజేందరేనని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్ 2018లో తనను చంపేందుకు కూడా కుట్ర చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్‌ను ఇక నుంచి చీటర్ రాజేందర్‌గా పిలుస్తానన్నారు. ఈటల రాజేందర్ భార్య ముదిరాజ్​లను చిన్న కులంగా సంబోధించి అవమానించారని.. దానికి ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  

ఒకప్పుడు ఇల్లు కూడా సరిగా లేని ఈటల రాజేందర్.. వందల కోట్లతో ఐదెకరాల గడీ ఎలా కట్టుకున్నారని.. పది, పదిహేను కోట్ల రూపాయల కార్లు ఎలా వచ్చాయని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. దళితులు, బీసీలు, గిరిజనుల భూములను లాక్కున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్​ను ఓడించే వరకూ తాను విశ్రమించేది లేదని.. రాజకీయంగా కూల్చేది తనేనని కౌశిక్ రెడ్డి అన్నారు. ఓటమి తప్పదని తెలిసి ఈటల ఆగమవుతున్నారని.. అన్ని పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్​లో అమరవీరుల స్థూపం కూల్చివేతలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపాలిటీ తీర్మానం మేరకే కూల్చారని ఎమ్మెల్యేగా ఆ తీర్మానాన్ని ఈటల రాజేందర్ ఆమోదించారన్నారు.

ABOUT THE AUTHOR

...view details